Thursday, December 12, 2024

Shirdi | షిరిడీ ఆలయంలో పూలమాల సేవలు పునఃప్రారంభం

షిరిడీ, (ఆంధ్ర‌ప్ర‌భ‌) : కరోనా సమయంలో నిలిపివేసిన పూలమాల సేవలను మహారాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు నేటి నుంచి పూలమాలలు శ్రీ సాయిబాబా సమాధి ఆలయంలో ప్రారంభించారు.

మాజీ ఎంపీ డా.సుజయ్ విఖే పా. శ్రీ సాయిబాబా సమాధి దర్శనం చేసుకొని పూలమాలలు ఉంచి ఈ సేవలను తిరిగి ప్రారంభించారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ ప్రొ.ముఖ్య కార్యనిర్వహణాధికారి బాలాసాహెబ్ కొలేకర్, ప్ర.డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సందీప్ కుమార్ భోసలే, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రజ్ఞా మహందులే, ఆలయ విభాగాధిపతి విష్ణు థోరట్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement