Monday, November 18, 2024

Garba Dance: అరె వా..గ‌ర్భాడ్యాన్స్‌కు యూనెస్కో

గుజరాత్‌కు చెందిన ప్రముఖ గర్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు ల‌భించింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుజరాత్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలో నిర్వహించే గర్బాను ఈ జాబితాలో చేర్చాలంటూ భారతదేశం నామినేట్ చేసింది.

ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పటేల్ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘అమ్మవారి ఎదుట భక్తిని చాటే ఈ గర్భా నృత్యం ఒక పురాతన సంప్రదాయం. ఇది సజీవంగా వర్ధిల్లుతోంది. గుజరాత్‌కు గుర్తింపుగా నిలిచిన గర్బాను యునెస్కో తన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్‌లో చేర్చింది.గర్బా అనేది ఒక నృత్య రూపకంగా ప్రాచుర్యం పొంది, సంప్రదాయాన్ని కలబోస్తూ, అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేసేదిగా నిలుస్తున్నదని యునెస్కో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement