Friday, November 22, 2024

గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

వెంకటాచలం టోల్‌ప్లాజ్‌ వద్ద రూట్‌వాచ్‌ తనిఖీల్లో భాగంగా సెబ్‌ నెల్లూరు-2 ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టగా విజయవాడ నుండి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 21.200 కేజీల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నామ‌ని అసిస్టెంట్‌ కమిషనర్‌ రవికుమార్‌ తెలిపారు.

గంజాయి మత్తు అనేది యువతలో ఫ్యాషన్‌గా మొదలై..చివరికి బానిసలుగా బలవుతారని, పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని సబ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎస్‌ రవికుమార్‌ పేర్కొన్నారు. నేటి యువత ఫ్యాషన్‌ కోసం మత్తు పదార్ధాలకు అలవాటు పడి చివరికి ఆ మత్తుకు బానిసలుగా మారి తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని, ఒక్కసారి ఈ మత్తుకు అలవాటు పడితే అందులో నుంచి బయటపడలేరన్నారు. మత్తు పదార్ధాల వినియోగం వల్ల ఎంతో మంది మృత్యువాత చెందారని, యువత ఈ విషయాన్ని గుర్తించుకుని మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటువంటి వాతావరణంలో తిరుగుతున్నారు..అన్న విషయాలను తల్లిదండ్రులు గమనిస్తుండాలన్నారు. గంజాయి అక్రమ రవాణా ముఠా సభ్యులను పట్టుకోవడంలో కృషి చేసిన ఇన్‌స్పెక్టర్‌లు కెపి కిషోర్‌, వి వెంకటేశ్వరరావు, ఎస్సైలు రమణమ్మ, శకుంతలమ్మ, సిబ్బంది సాయిబాబు, రవి, మల్లికార్జునరావు, భాస్కర్‌, హరి తదితరులను సెబ్‌ జేడీ కె శ్రీలక్ష్మి ప్రత్యేకంగా అభినందించారని, వీరికి త్వరలోనే రివార్డులు కూడా అందిస్తారని ఏసీ రవికుమార్‌ తెలిపారు. ఈ సమావేశంలో ఏఈఎస్‌ కృష్ణకిషోర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు కెపి కిషోర్‌, వి వెంకటేశ్వరరావు, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement