అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా సౌరవ్ గంగూలీ ఎంపిక కాబోతున్నాడు. ఐసీసీ ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్ల్కే పదవీకాలం నవంబర్‌లో ముగియనుంది. తదుపరి ఐసీసీ చైర్మన్ ఎంపికపై ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌తో ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జై షా పోటీలో ఉన్నట్లు వార్తలు వినిపించినా, అవన్నీ పుకార్లేనని బీసీసీఐ కొట్టిపారేసింది.
ఐసీసీ చైర్మన్ ఎన్నికకు ఇంకా చాలా సమయముందని, దీనిపై ఇప్పుడు చర్చ అనవసరమని బీసీసీఐ అధికారులు వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే స్పోర్ట్స్ స్టార్ కథనం ప్రకారం… ఐసీసీ తదుపరి చైర్మన్ దాదా ఎంపిక లాంఛనమేనని తెలుస్తోంది. ఐసీసీ చైర్మన్లుగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా, ఆ తర్వాత శరద్ పవార్, శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.