బీహార్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఒక 13 ఏళ్ళ బాలికను అపహరించిన ఆరుగురు వ్యక్తులు ఆమెపై 28 రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఆగస్టు 5వ తేదీ సాయంత్రం బాధితురాలి తల్లికి ఫోన్ చేసిన నిందితులు ఆమెను సరయా చౌక్ నుంచి తీసుకువెళ్లాల్సిందిగా చెప్పారు. ఐపీసీ సెక్షన్ 366ఏ, పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన జిల్లా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవడానికి వేర్వేరు చోట్ల తనిఖీలు నిర్వహించారు.
సరయా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిస్వానియా గ్రామానికి చెందిన నిందిుడు జులై 9వ తేదీన ఒక కారులో వచ్చి తన కుమార్తెను కిడ్నాప్ చేసుకొని తీసుకువెళ్లాడని బాధితురాలి తల్లి ఒక రాతపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు. ”నిందితుడిపై జులై 9న ఫిర్యాదు చేసినప్పటికీ జిల్లా పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. ఆగస్టు 5న రాత్రి 8 గంటలకు నిందితుడు నాకు ఫోన్ చేశాడు. సరయా చౌక్ నుంచి నా కుమార్తెను తీసుకొనివెళ్ళాల్సిందిగా చెప్పాడు.
నేను అక్కడికి చేరుకునేసరికి నా కుమార్తె ఒంటరిగా కనిపించింది. ఆమెను ఇంటికి తీసుకొనివెళ్లాను. పోలీసులకు సమాచారం అందించాను” అని ఫిర్యాదులో బాధితురాలి తల్లి పేర్కొన్నారు. జులై 9న ఆమెను కిడ్నాప్ చేసిన అనంతరం నిందితులు ఆమెను ఒక గుర్తుతెలియని ప్రాంతంలో 28 రోజులపాటు బందీగా ఉంచారు. బాధితురాలు చెప్పినదాన్ని బట్టి నిందితుడ్ని పట్టుకోవడానికి దాడులు చేపట్టామని ముజఫర్‌పూర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో విజయ్ కుమార్ సింగ్ తెలిపారు.