ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండే గంగవ్వ సెలబ్రిటీ రేంజ్ కి ఎదిగింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక ఆమె పేరు మరింత మారుమ్రోగుతోంది. యూట్యూబ్ ద్వారా గంగవ్వ ఎంతో ఫేమస్ ఐపోయింది. ఆమెలోని బామ్మతనాన్ని చూపించేందుకు చాలా మంది యూట్యూబర్స్ ఆమెను సంప్రదిస్తూ ఉంటారు. మై విలేజ్ షో’ పేరుతో ఎంతో ఫేమస్ అయింది గంగవ్వ. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక ఎక్కువ కాలం ఉండలేకపోయింది. పల్లెటూరిలో హాయిగా ఎగిరే పిట్టలా ఉండే ఆమెను హౌస్ లో కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెట్టారు అంటూ టాక్ కూడా అప్పట్లో నడిచింది. తర్వాత ఆమెను హౌస్ నుంచి గౌరవంగా పంపారు హోస్ట్ నాగార్జున. అంతేకాదు ఆమెకు ఒక కొత్త ఇల్లు కట్టిస్తానని చెప్పారు. చెప్పినట్టే గంగవ్వ పోయినేడాది కొంత ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేసేసారు.
ఐతే ఇప్పుడు ఆమె కొన్ని మూవీస్ లో యాక్ట్ చేయడానికి సిద్ధమౌతున్నారు. ఈమె కోసం షూటింగ్స్ సమయంలో ప్రత్యేక క్యారవాన్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారట. ఈ విషయాన్ని డైరెక్ట్ గా చెప్పింది గంగవ్వ. ఇక క్యారవాన్ లో అన్ని సదుపాయాలు ఉంటాయని చెప్పింది. తాను ఎక్కడికి షూటింగ్ కి వెళ్లినా సరే ఆమె కోసం ప్రత్యేకంగా క్యారవాన్ ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా తన యూట్యూబ్ లో పోస్ట్ చేసింది గంగవ్వ. టాప్ మోస్ట్ వాళ్లకు మాత్రమే ఇండస్ట్రీలో క్యారవాన్ సౌకర్యం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు నిర్మాతలు గంగవ్వకు క్యారవాన్ సౌకర్యం కల్పించడం అనే విషయం నిజంగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదృష్టం అంటే గంగవ్వదేనని అందరూ అభిప్రాయపడుతున్నారు.నిజమే కదా మరి.