బ్యూటీ పార్లర్లో పని చేస్తున్న ఓ యువతిపై పార్లర్ మేనేజర్‌తో పాటు కస్టమర్ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఢిల్లిలో జరిగింది. మరో వైపు మహారాష్ట్రలో ఓ 35 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి రోడ్డు మీద పారేసి పారిపోయారు.
ఢిల్లిలో బ్యూటీపార్లర్‌లో స్పా విధులు నిర్వహిస్తున్న ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. పార్లర్ మేనేజర్‌తో పాటు ఓ కస్టమర్ కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం కొన్నాళ్ల క్రితం బాధితురాలు.. పితాంపుర ప్రాంతంలో ఉన్న ఓషన్ స్పాలో చేరింది. అయితే శుక్రవారం రాత్రి పార్లర్ మేనేజర్ రాహుల్, కస్టమర్ సతీష్ మత్తు పదార్థాలు సేవించి పార్లర్‌కు వచ్చారు. ఆ సమయంలో పార్లర్లో ఉన్న బాధితురాలిపై సామూహిక అత్యాచారం చేశారు. వెంటనే బాధితురాలు మౌర్య ఎన్క్లేవ్ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి చెప్పింది. హుటాహుటిన పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మేనేజర్, కస్టమర్‌ను అరెస్ట్ చేశారు. బాధితురాల్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని, విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.
మహరాష్ట్రలో మరో దారుణం…
మహరాష్ట్రలోని భండారా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. 35 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక
అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం రోడ్డుపై పడేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనపై మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే, సీరియస్ అయ్యారు. సిట్ ద్వారా విచారణ జరిపించాలని ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.