జార్ఖండ్ రాజధాని రాంచీలో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం జరిగింది. ఓ బాలికపై కొంత మంది అత్యాచారం చేస్తారు. ఆ తరువాత బాధితురాలిని విడిపించేందుకు ఆమె స్నేహితురాలిని పిలిపించుకుని.. ఆమెపై కూడా అత్యాచారం చేస్తారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె కళ్ల ముందే.. స్నేహితురాలిపై కూడా సామూహిక అత్యాచారం జరుగుతుంది. రాంచీలోని తుపుదాన్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఆమె బంధువుల ఇంటికి వచ్చింది. బాలికను ఆమె ఇంటికి వదిలి రావాల్సిందిగా ఆ ఇంటి పక్కనే ఉన్న ఓ వ్యక్తిని బంధువుల మహిళ కోరింది. ఆమెను ఇంటికి తీసుకెళ్తున్నట్టు నమ్మించి.. ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేస్తాడు.
ఆ తరువాత అతని స్నేహితులను పిలిపించుకుని.. అందరూ కలిసి బాలికపై అత్యాచారం చేస్తారు. స్నేహితురాలిని పిలిపిస్తే.. తనను వదిలేస్తామని చెప్పడంతో.. ఆమె ఓ స్నేహితురాలికి ఫోన్ చేసి రావాల్సిందిగా కోరుతుంది. ఆమె వచ్చిన తరువాత.. అందరూ కలిసి.. ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వారిని వదిలేస్తారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆరుగురిని అరెస్టు చేశారు. ఇద్దరు బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రి తరలించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ మేరకు బాధిత బాలికల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..