Monday, December 23, 2024

Delhi | ఇట్స్ ఫ్యామిలీ టైం.. ఐకానిక్‌ రెస్టారెంట్‌లో గాంధీల కుటుంబ భోజనం !

దేశ‌ రాజకీయాల్లో బిజీగా ఉన్న సోనియా గాంధీ కుటుంబం ఆదివారం రిలాక్స్‌గా కనిపించింది. రాహుల్, ప్రియాంక గాంధీ కొంత విరామం తీసుకుని తమ కుటుంబంతో గడిపారు. ఢిల్లీలోని ఐకానిక్ క్వాలిటీ రెస్టారెంట్‌లో విందు ఆరగించారు. సోనియా గాంధీతో పాటు, రాహుల్ గాంధీ, ప్రియాంక, ప్రియాంక భర్త రాబర్ట్‌ వార్దా, కూతురు మిరాయా వాద్రా, అత్తగారు కూడా ఉన్నారు.

వీరు క్వాలిటీ రెస్టారెంట్‌లో చోలే-భాతురే, నోరూరించే ఇతర వంటకాలను రుచిచూశారు. ఈ అందమైన దృశ్యాలను రాహుల్‌ గాంధీ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. సోషల్‌ మీడియాలో వచ్చిన ఈ చిత్రాలకు నెటిజన్ల నుండి విశేషంగా లైక్‌లు, కామెంట్లు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement