కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోను మార్చి కొత్త నోట్లు ముద్రించనున్నారని వస్తున్న వార్తలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖండించింది. కరెన్సీ నోట్లపై గాంధీ చిత్రానికి బదులుగా రవీంద్రనాధ్ ఠాగూర్, అబ్దుల్ కలాం వంటి ప్రముఖుల ఫోటోలు ముద్రించనున్నారని కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఇందు కోసం ఆర్బీఐ, ఆర్ధిక శాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నాయని , ఇందుకు అవసరమైన డిజైన్లు కూడా పూర్తయినట్లు వార్తా కధనాలు వచ్చాయి.
ఈ వార్తలపై సోమవారం నాడు స్పందించిన రిజర్వ్ బ్యాంక్ ఇవన్నీ వట్టి వ దంతులేనని కొట్టిపారేసింది. ప్రస్తుతం కరెన్సీ నోట్లపై ముద్రిస్తున్న మహాత్మాగాంధీ ఫోటోను మార్చే ప్రతిపాదనేది లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలను నమ్మవద్దని ప్రజలను కోరింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.