Thursday, November 21, 2024

గాంధీలో రేపటి నుంచి నాన్ కోవిడ్ సేవలు..

కరోనా మహమ్మారి పీక్స్ లో ఉన్నప్పుడు పూర్తిగా కోవిడ్ రోగుల చికిత్సకు అంకితమయింది గాంధీ ఆస్పత్రి. మొదటి వేవ్‌ తగ్గిన తర్వాత నాన్‌ కోవిడ్‌ సేవలు ప్రారంభించినా.. మళ్లీ సెకండ్‌ వేవ్‌ పంజా విసరడంతో.. కోవిడ్‌ సేవలకే పరిమితం అయ్యింది కాగా ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖ పట్టాయి. దీంతో ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య కూడా తగ్గుతోంది. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా తగ్గిపోవడంతో.. రేపటి నుంచి మళ్లీ సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు వెల్లడించారు. కోవిడ్ కారణంగా నిలిపివేసిన అన్ని రకాల సాధారణ వైద్య సేవలను మంగళవారం నుంచి పునరుద్ధరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు వైద్యులు.

ఇది కూడా చదవండి: ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉధృతి..

Advertisement

తాజా వార్తలు

Advertisement