Friday, November 22, 2024

షటిల్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన సీఐ

మనిషి జీవితంలో మృత్యువు ఎలా వస్తుందో ఎవరు చెప్పగలరు?. ఎందుకంటే చావు మన చేతిలో లేదు. అనుకోకుండా కొన్ని సార్లు ఆటలాడుతూ కూడా ప్రాణాలు విడవొచ్చు. అచ్చం ఇలాంటి ఘటన ఏపీ పోలీస్ డిపార్టుమెంట్‌లో జరగడం విషాదాన్ని నింపింది. పశ్చిమగోదావరి జిల్లా గణపవరం సీఐ షటిల్ ఆడుతూ ప్రాణాలు విడిచారు. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో సీఐ భగవాన్ ప్రసాద్ సన్నిహితులతో కలిసి సమీపంలోని ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుతున్నారు. ఇదే సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement