ఏపీ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందన్నారు గల్లా జయదేవ్. పార్లమెంటులో తాము అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానాలు ఇవ్వడం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై రామ్మెహన్ నాయుడు అడిగిన ప్రశ్నలకు కేంద్రం స్పందించిన తీరుపై గల్లా ఈ కామెంట్స్ చేశారు. ఏపీఆర్ఏ అంశంపై తాము అడిగిన సాధారణ ప్రశ్నలకు సైతం బదులివ్వడానికి నిరాకరిస్తున్న కేంద్రం, అప్రాధాన్య అంశాలపై మాత్రం స్పందిస్తోందని ఆరోపించారు. కేంద్రం వైఖరి చూస్తుంటే ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అనాసక్తిగానూ, అయిష్టంగానూ ఉన్నట్టు అర్థమవుతోందని గల్లా జయదేవ్ విమర్శించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement