తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఇస్రో వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే ఏడాది ప్రారం భంలో అంతరిక్ష యాత్రకు సంబంధించి టెస్ట్ ఫ్లైట్‌లను ప్రారంభించనుంది. ఈ మేరకు ఇస్రో సీనియర్ అధికారి ఒకరు భవిష్యత్ ప్రణాళిక గురించి తెలిపారు. గగన్‌యాన్ హ్యూమన్ స్పేస్ ఫ్టైట్ మిషన్‌లో భాగంగా మూడు రోజుల పాటు వ్యోమగాములను కక్ష్యలోకి తీసుకెళ్లే క్రూ మాడ్యూల్‌ను పరీక్షించేందుకు హెవీ లిఫ్ట్ చినూక్ హెలికాప్టర్, సి-17 గ్లోబ్ మాస్టర్ ట్రాన్స్‌పోర్టు ఎయిర్ క్రాప్టులను మోహరించాలని అంతరిక్ష సంస్థ భావిస్తోందని ఇస్రో హ్యూమన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఉమా మహేశ్వరన్ చెప్పారు.
వచ్చే ఏడాది డిసెంబర్‌లో మానవ రహిత అంతరిక్ష యానా నికి ముందు ఇస్రో కనీసం 17 రకాల పరీక్షలను నిర్వహించనుంది. కొవిడ్ కారణంగా ఈ ప్రాజెక్టులో జాప్యం జరిగిన ప్పటికీ, 2024 చివరి నాటికి భారతీయ వ్యోమగా ములు తమ తొలి అంతరిక్ష ప్రయాణాన్ని చేపట్టే అవకాశం ఉందన్నారు. స్పేస్ క్యాప్యూల్ వెలుపల ఉష్ణోగ్రతలు 2000 డిగ్రీల సెల్సియస్ కు చేరుకునే అవకాశం ఉన్నందున, క్రూ మాడ్యూల్, పర్యా వరణ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు సంక్లిష్ట సవాల్. అంతరిక్ష ప్రయాణానికి నలుగురిని ఎంపిక చేశాం. ఇప్పటికే వారు రష్యాలో శిక్షణ పూర్తి చేసుకున్నారని మహేశ్వరన్ తెలిపారు.