Sunday, October 6, 2024

Paris Olympics | చెఫ్ డి మిషన్‌గా గగన్ నారంగ్.. సిందూకు పతాకధారిగా గౌరవం

పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓసీ) కీలక నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న విశ్వ క్రీడలు పారిస్‌ ఒలింపిక్స్‌-2024 ఆరంభ వేడుకల్లో భారత చెఫ్ డి మిషన్‌ (అంతర్జాతీయ క్రీడా కార్యక్రమంలో జాతీయ జట్టుకు ప్రాధాన్యత వహించే వ్యక్తి)గా ప్రముఖ షూటర్‌ గగన్‌ నారంగ్‌ను ఐఓసీ ఎంపిక చేసింది.

వెటరన్‌ బాక్సర్‌ మెరీకోమ్‌ వ్యక్తిగత కారణాలతో చెఫ్‌ ద మిషన్‌ పదవికి రాజీనామా చేసింది. దాంతో ఆమే స్థానంలో నారంగ్‌ భారత బృందాన్ని నడిపిస్తాడని ఐఓసీ వెల్లడించింది. ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ శరత్‌ కమల్‌తో కలిసి పీవీ సింధు భారత పతకధారిగా ఉంటుందని భారత ఒలింపిక్‌ సంఘం వెల్లడించింది. దాంతో భారత మహిళా అథ్లెట్ల పరేడ్‌ సమయంలో తెలుగు తేజం పీవీ సింధు పతకధారిగా వ్యవహరించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement