Saturday, November 23, 2024

క్యాబినెట్ మీటింగ్ లో.. కుప్ప‌కూలిన గ‌బాన్ విదేశాంగ మంత్రి

క్యాబినెట్ మీటింగ్ జ‌రుగుతుండ‌గానే గుండెపోటు రావ‌డంతో కుప్ప‌కూలారు గబాన్‌ విదేశాంగ మంత్రి మైఖేల్‌ మౌసా అడామో . క్యాబినెట్‌ మీటింగ్ లో ఆయన ఒక్క‌సారిగా కుప్పకూలారు. ఈ విషయాన్ని గబాన్‌ అధ్యక్షుడు అలీ బొంగో ఒడింబా ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. అడామో మరణం దేశానికి తీరని లోటు అని, తనకు ఎంతో నమ్మకస్తుడైన దౌత్యవేత్తను కోల్పోయానని ఒడింబా ట్వీట్‌ చేశారు. అడామో మృతికి వివిధ దేశాలకు చెందిన అధినేతలు సంతాపాలు తెలియజేస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ కూడా ట్విటర్‌ ద్వారా సంతాపం ప్రకటించారు. అడామో కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement