మరో ప్రాజెక్ట్ ని ప్రారంభించింది జీఏ2 పిక్చర్స్ బ్యానర్. తేజ మర్ని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు బన్నీ వాసుతో పాటు విద్య మాధురి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి బన్నీ వాసు తనయ బేబీ హన్విక క్లాప్ కొట్టింది. ఇందులో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూర్తిగా కంటెంట్ ప్రధానంగానే ఈ సినిమా కథ సాగుతుంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. భాను ప్రతాప్ సహ నిర్మాత, ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర మేకర్స్.
Advertisement
తాజా వార్తలు
Advertisement