Tuesday, November 26, 2024

USA | ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే ఏఐ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, నెట్ జీరో సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం ‘ది ఫ్యూచర్ స్టేట్’కు పర్యాయపదంగా మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం.. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్‌టేబుల్‌లో టెక్ యునికార్న్స్ సీఈవోలను ఉద్దేశించి మాట్లాడారు..

తెలంగాణలో చేపడుతున్న కొత్త ప్రాజెక్టులను వివరిస్తూ, ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం అని రేవంత్ పిలుపునిచ్చారు.

కాగా, ‘ఇప్పటివరకు మేము న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్యటించాం. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాం. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతని సూచించే నినాదం ఉంది. ‘అవుటాఫ్ మెనీ.. వన్’ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదం. టెక్సాస్‌ను ‘లోన్ స్టార్ స్టేట్’ అని పిలుస్తారు. కాలిఫోర్నియాకు ‘యురేకా’ అనే నినాదం ఉంది. అయితే మన దేశంలో రాష్టాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవు. ఇప్పటినుంచి తెలంగాణ రాష్ట్రానికి అటువంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్‌గా పెట్టుకుందాం.ఇకపై మన రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్.. అని పిలుద్దాం.’ అని సీఎం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement