Friday, November 22, 2024

భవిష్యత్తు టిడిపిదే.. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ఠతకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కావడం ఖాయమని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. సోమవారం ఎన్టీఆర్ భవన్లో.. జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ నాయకులు మెట్టుకాని శ్రీనివాసులు, మోపతయ్య ఆధ్వర్యంలో వీరికి జ్ఞానేశ్వర్ టిడిపి కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీని క్షేత్ర స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడానికి కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు.

ఖమ్మం సభ నుంచే “ఇంటింటికి టీడీపీ కార్యక్రమం” ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి టీడీపీ కరపత్రాలను అందజేస్తున్నామని చెప్పారు. ఈ కరపత్రాలలో గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను,రాబోయే రోజులలో ఏమి చేస్తామన్న అంశాలను ప్రజలకు వివరిస్తామన్నారు. త్వరలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మండలాలు, మున్సిపల్ డివిజన్లలో ఒకే దఫాలో ఉద్యమ స్థాయిలో ప్రారంభించనున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలకు అన్ని రకాలుగా మేలు జరగాలంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలని, ఈ దిశగా అన్ని వర్గాలు ప్రజలు మద్దతు ప్రకటించాలని కాసాని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు.

- Advertisement -

బీఆర్ఎస్ నుంచి టీడీపీలో చేరింది వీరే..

జడ్చర్ల టౌన్, రూరల్ కు చెందిన మాజీ సర్పంచ్ సి. పెంటయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు టిడిపిలో చేరారు. వీరిలో ఎండి. తౌఫిక్ అహ్మద్, అహ్మద్ హజ్రామి, సి.హెచ్. అశోక్ వర్ధన్, బి. వంశీ, ఎస్. అయోధ్య, సి.హెచ్. భ్రమరాంబ, డి. శ్రీనివాసులు, సి. శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement