Tuesday, November 19, 2024

నిప్పుల కొలిమి.. కుంభవృష్టి! అప్పటికప్పుడే వాతావరణ మార్పులు..

కొన్నిచోట్ల వర్షాభావం
మరికొన్ని ప్రాంతాల్లో జోరువానలు
భారత్‌పై గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావం

భారతదేశంలో గత కొన్ని దశాబ్దాల నుంచి భూమిపై వేడి పెరుగుతూ వస్తోందని మెట్రోలాజికల్‌ శాఖాధికారులు తెలిపారు. ఈ పరిణామం గ్లోబల్‌ వార్మింగ్‌కు దారితీస్తున్నాయని తెలిపారు. దీని వల్ల మానవ జీవనశైలిపై ప్రభావం చూపుతోందని తెలిపారు. ఇటీవల కొన్నిచోట్ల వర్షాభావంతో అల్లాడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో జోరువానలతో కుంభవృష్టితో కురుస్తోంది. ఇది గ్లోబల్‌ వార్మింగ్‌కు సూచనగా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధి కారులు హెచ్చరిస్తున్నారు. వాయుకాలుష్యం తో పాటు స్థానిక వాతావరణ మార్పుల కారణంగానే ఎల్ల ప్పుడు వేడిగా ఉండటానికి కారణమవుతోందన్నారు. దీంతో కూలి పనులు చేసుకునే వారితోపాటు ఇతర సాధారణ వ్యక్తులు వేడిగాలుల వల్ల ఉదయం 10 గంటలుదాటితే పనులు చేసుకోలేక పోతున్నారన్నారు.

గత 122 సంవత్సరాలుగా మెట్రోలాజికల్‌ అధికారుల రికార్డుల ప్రకారం గత సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు పేర్కొన్నారు. దేశంలో సగటు ఉష్ణోగ్రత 33 డిగ్రీలుగా నమోదవుతుంది. నెలవారీగా తక్కువ వర్షపాతం నమోదుతోపాటు వాతావరణంలో మార్పుల కారణంగా ఈశాన్య రాష్ట్రాలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా సగటు వర్షపాతానికంటే 72 శాతం తక్కువగా ఉంటుండగా, అది ఈ ఏడాది 89శాతానికి పెరిగింది. వేసవి కాలం ఏప్రిల్‌ జూన్‌ మధ్య విపరీతమైన వేడిని ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇది ముమ్మాటికి గ్లోబల్‌ వార్మింగ్‌కు సంకేతాలేనని మెట్రోలాజికల్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement