ప్రస్తుతం రీల్స్ హవా నడుస్తోంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చాలా మంది చాలా చేస్తుంటారు. ముఖ్యంగా రీల్స్ చేసి, సోషల్ మీడియాలో చాలా మంది ఫేమస్ అవుతున్నారు. కొందరు కొన్ని విన్యాసాలు చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంటే, తాజాగా ఓ జంట చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది.ఈ వీడియోలొ ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ తో ఉంది. అతనేమో ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటాడు. అయితే ఆమె మాత్రం ఆ వెంటనే మరో వ్యక్తి డబ్బుల కట్టతో కనపడగానే, ప్రియుడిని వదిలేసి అతని వద్దకు వెళ్లిపోయింది. అంతేకాదు అతని బైక్ కూడా ఎక్కి వెళ్లిపోతుంది. అది చూసి ఆమె ప్రియుడు షాకైపోతాడు. ఆ వెంటనే సింబాలిక్‌గా బాధాకరమైన పాట ప్లే అవుతుంది. ఆ యువకుడు అదే ఎక్స్ప్రెషన్ ఇస్తూ అలాగే చూస్తే ఉండిపోతాడు. ఈ వీడియో సరదా కోసం చిత్రీకరించినా.. అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.అయితే ఇది నిజంగా జరిగిన సంఘటన కాదు. సరదాగా తీసింది కావడం విశేషం. అయినా, ఇది నెట్టింట వైరల్ గా మారింది. తెగ వ్యూస్ వస్తున్నాయి. ఈ కాలం అమ్మాయిలు ఇలానే ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టడం విశేషం.
ఫన్నీ రీల్.. లక్షల్లో వ్యూస్
Advertisement
తాజా వార్తలు
Advertisement