Tuesday, December 3, 2024

TG | పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణానికి నిధులు విడుద‌ల‌…

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణానికి నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మంగళవారం పెద్దపెల్లి బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం రూ.82 కోట్ల విడుదల చేస్తూ జీవో విడుదల చేసింది. ఎన్నికల సమయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు బైపాస్ రోడ్డు ఏర్పాటుకు హామీ ఇచ్చారు.

పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా పెద్దపల్లిలో సీఎం పర్యటన సందర్భంగా నిధులు విడుదలయ్యాయి. బైపాస్ కు నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కి అందుకు సహకరించిన మంత్రి శ్రీధర్ బాబుకు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కృతజ్ఞతలు తెలియజేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement