డబుల్ బెడ్ రూం ఇళ్ల కాలనీల్లో కనీస సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసింది. ఆయా కాలనీల్లో కనీస సౌకర్యాలు రూ.196కోట్ల 46లక్షల నిధులను మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్అండ్బీ శాఖ జీఓ 892 జారీ చేసింది.
కనీస సౌకర్యాల కల్పనలో భాగంగా డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీల్లో నీటి వసతి, విద్యుదీకరణ, మురుగునీటి పారుదల వ్యవస్థను చేపట్టనున్నారు. గత ప్రభుత్వం నిర్మించి కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా వదిలేయడంతో లబ్ధిదారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.