అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.. ఇప్పటివరకూ రూ 1500 కోట్లకు పైగా విరాళాలు వసూలయ్యాయి. మందిర నిర్మాణానికి జనవరి 15న ప్రారంభమైన విరాళాల సేకరణ కార్యక్రమం ఈనెల 27తో ముగుస్తుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. అయోధ్యలో అద్భుతంగా నిర్మించే రామాలయ నిర్మాణానికి దేశం యావత్తూ నిధులను అందిస్తోందని ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. విరాళాల సేకరణ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా తాము నాలుగు లక్షల గ్రామాలను సందర్శించి 11 కోట్ల కుటుంబాలకు చేరువవ్వాలని లక్ష్య్ంగా నిర్ధేశించుకున్నామని చెప్పారు. విరాళాల సేకరణ కోసం తాను సూరత్ చేరుకున్నానని, ప్రజలు పెద్దసంఖ్యలో ట్రస్ట్‌కు విరాళాలు అందిస్తున్నారని చెప్పారు. ధర్మం కోసం ముందుకు వచ్చేందుకు 492 ఏండ్ల తర్వాత ప్రజలకు మంచి అవకాశం లభించిందని అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement