దేశంలో అన్ని టెలికం సేవలు అందించేలా అదానీ డేటా నెట్‌వర్క్‌కు యూనిఫైడ్ లైసెన్స్ మంజూరైంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన అదానీ డేటా నెట్‌వర్క్స్ ఇటీవల జరిగిన 5జీ వేలంలో 26 గిగా హెర్జ్స్ మిల్లిdమీటర్ వేవ్ బ్యాండ్‌లో 400 మెగాహెడ్జ్ స్పెక్ట్రమ్‌ను 212 కోట్లకు కొనుగోలు చేసింది. కేవలం కంపెనీ వ్యాపార అవసరాల కోసమే స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసినట్లు కంపెనీ అప్పట్లో ప్రకటించింది.
అదానీ గ్రూప్‌లోని అన్ని బిజినెస్‌లకు కలిపి ఒక సూపర్ యాప్‌ను కూడా డెవలప్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. తాజాగా అన్ని టెలికం సేవలు ప్రారంభించేందుకు లైసెన్స్ మంజూరు అయ్యిందని ఒక అధికారి వెల్లడించారు. దీనిపై కంపెనీ ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.