Friday, November 22, 2024

కీవ్‌కు సంపూర్ణ మద్దతు : అమెరికా స్పీకర్‌ పెలోసి..

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో అమెరికా స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఆదివారం పర్యటించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఉక్రెయిన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రష్యా బెదరింపులకు భయపడేది లేదన్నారు. అమెరికా మరింత ఆయుధ సహాయం అందిస్తుందని కుండబద్దలుకొట్టారు. అంతకుముందు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఆమె విస్తృత చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌కు నిస్సందేహంగా మద్దతు ఇస్తున్న విషయాన్ని ప్రపంచమంతటా ప్రతిధనించేలా చేసేందుకు తాను పర్యటిస్తున్నానని ఆమె అన్నారు. సేచ్ఛా స్వాతంత్య్రాలకోసం ఉక్రేనియన్లు చేస్తున్న పోరాటాన్ని ఆమె శ్లాఘించారు.

సహచర సైనికులను చంపిన చెచెన్‌ దళాలు..

రష్యా తరపున ఉక్రెయిన్‌పై పోరాడుతున్న చెచెన్‌ దళాల క్రూరత్వం మరోసారి వెలుగుచూసింది. ఉక్రెయిన్‌లో జొరబడి పౌరులను ఊచకోత కోసేందుకు తహతహలాడుతున్న చెచెన్‌ సైనిక ముఠాల(కడిరోవ్‌ట్సి)కు ఉక్రెయిన్‌ సైనికులు, ప్రజలనుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఇది సహించలేని చెచెన్‌ ముఠాలు దిక్కుతోచక పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తున్నారు. ఉక్రెయిన్‌ దాడుల్లో తీవ్రంగా గాయపడిన సైనికులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక వైద్య శిబిరంలోకి మోసుకొస్తున్నారు. ఆ తరువాత కాల్చి చంపేస్తున్నారు. ఇది ఒక మరణశిబిరంగా మారిపోయింది. పౌరులను రష్యా ఊచకోత కోసిన బుచా పట్టణంలో వాయువ్య ప్రాంతంలోని యబ్లోన్‌స్కా వీధిలో ఉన్న గ్లాస్‌ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన చాంబర్లలో సొంత సైనికులను చాంబర్లలో బంధించి.. హింసించి, కాల్చి చంపేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని ఉక్రెయిన్‌కు చెందిన మానవహక్కుల సంస్థ అంబుడ్స్‌మన్‌ ల్యుడిమిల డెనిసోవ, ఇర్పిన్‌ కౌన్సిల్‌ మెంబర్‌ ఆర్టెమ్‌ హ్యూరిన్‌ ధ్రువీకరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement