Monday, November 25, 2024

గోదాముల్లో ఫుల్ స్టాక్.. యాసంగి వడ్లు నిల్వ చేసేదెలా..

మెదక్‌, (ప్రభ న్యూస్‌) : గోదాముల్లో నిల్వ ఉన్న వరి ధాన్యాన్ని తరలించాలని రాష్ట్ర ప్రభుతం కేంద్రం ప్రభుతానికి విన్నవించినా పట్టించుకోవడం లేదు.. రాష్ట్రంలో గత వానాకాలం ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ ఉంచారు. ఈ సారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆందోళనల మధ్య ధాన్యం కొనుగోలు ఆలస్యమైంది. గోదాంలో ఉన్న వరి ధాన్యాన్ని తరలిస్తే యాసంగిలో పండించిన పంట గోదాంలో నిల్వ ఉంచుకునే అవకాశం ఉంది. దీంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం వచ్చే వానాకాలం పంట వరకు నిల్వ చేసుకోవచ్చు. ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. దీనికి అనుగుణంగా గోదాములు మాత్రం పెరగడం లేదు. గతంతో పోలిస్తే గోదాముల నిర్మాణాలు పెరిగినా నిలలకు సరిపడే విధంగా ఏర్పాటు చేయడం లేదు. వచ్చే వారం రోజుల నుంచి వరి కోతలు, పత్తి తీయడం ప్రారంభమవుతోంది. ఈ సారి వరి సాగు జోరుగానే సాగింది. భారీగా దిగుబడి వస్తుందని అంచనా వేశారు. వచ్చే స్టాక్‌ ఎక్కడ నిల చేయాలనే దానిపై జిల్లా యంత్రాంగం తర్జనభర్జన పడుతోంది. వరితో పాటు పత్తి దిగుబడి కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో నిలల విషయమై అయోమయం నెలకొంది. పాత స్టాక్‌ వెళ్లిపోతే కూడా ప్రస్తుతం గోదాములు సరిపోని పరిస్థితులు, ఇంకా సగానికి పైగా గోదాముల్లో నిలలున్నందున ఏమి చేయాలనే దానిపై యంత్రాంగం తలలు పట్టుకుంటున్నారు. పెరుగుతున్న సాగు విస్తీర్ణానికి అనుగుణంగా గోదాములు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. సాగు విస్తీర్ణం పెరుగుతోంది. కానీ వీటిని నిల్వ చేసేందుకు కావాల్సిన గోదాముల సంఖ్య మాత్రం పెరగడం లేదు. భారీగా వర్షాలు కురుస్తున్నందునా రికార్డు స్థాయిలో వరి సాగవుతోంది. జిల్లా వ్యాప్తంగా 18 గోదాములున్నాయి. ఒక గోదాముల సామర్థ్యం 65 వేల మెట్రిక్‌ టన్నులు.

సుమారు 3 లక్షల 30 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చే చాన్స్‌..

రికార్డు స్థాయిలో వరిపంట సాగయ్యింది. అదే స్థాయిలో దిగుబడి కూడా వస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ సారి యాసంగిలో 3 లక్షల 30 వేల మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో భూగర్భజలాలు పెరుగుతుండడంతో పాటు చెక్‌డ్యాంలల్లో నీరు నిల్వ ఉండడంతో మెజార్టి రైతులు వరి వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే ఈ సారి వానాకాలంలో కూడా రికార్డులు బ్రేక్‌ చేస్తూ వరిపంట సాగు చేశారు. ప్రస్తుతమున్న అన్ని గోదాములు ఖాళీ చేసినా ధాన్యానికి సరిపోవు. 3 లక్షల 30 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తే ఎక్కడ నిల్వ చేస్తారనేది ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికే కోతలు ప్రారంభం కానున్నాయి. నీటి వసతులు ఉన్న రైతులు ముందుగానే వరినాట్లు వేశారు. వారంలో రైతులు కోతలు ప్రారంభించనున్న నేపథ్యంలో స్టాక్‌ ఎక్కడ పెట్టుకోవాలనే దానిపై అయోమయం నెలకొంది. వరితో పాటు పత్తి కోతలు కూడా ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతమున్న గోదాముల్లో ఎక్కువగా పత్తి నిల్వలే ఉన్నాయి. కొత్తగా వచ్చే స్టాక్‌ ఎక్కడ పెడతారనేది అయోమయం నెలకొంది. గోదాముల అన్వేషణలో అధికారులు ఉన్నారు.

రైతు వేదికల్లో కూడా స్టాక్‌..

రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన రైతు వేదికల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో స్టాకులు ఏర్పాటు చేశారు. వాస్తవానికి స్టాక్‌ పెట్టుకుంటే ప్లోరింగ్‌ కుంగిపోయే ప్రమాదం లేకపోలేదు. దీంతో ఉన్న స్టాక్‌నే ఎత్తివేసే పరిస్థితిలు నెలకొన్నాయి. ఇందులో రైతులకు సంబంధించిన కార్యాక్రమాలు మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గోదాముల కొరత నేపథ్యంలో రైతు వేధికలను కూడా గోదాములుగా వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ గోదాములను వినియోగించుకునేందుకు వేదికలు తట్టుకునే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement