Wednesday, November 20, 2024

ఉగ్రపోరులో జవాన్లకు స్వేచ్ఛ

ఉగ్రవాదులను ఏరిపారేయండి
యాంటీ టెర్రర్‌ ఆపరేషన్లు స్పీడు పెంచండి
ప్రభుత్వం అండగా ఉంటుంది..
సరిహద్దు వెంట నిఘా పెంచాలి
చొరబాట్లను అడ్డుకోవాలి..
ఉన్నతాధికారులతో సమీక్ష జమ్మూలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

న్యూఢిల్లి : దేశ భద్రతలో జవాన్ల పాత్ర ఎంతో కీలకం అని, ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అంది స్తుందని, ఉగ్రవాదాన్ని అంతం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. మూడు రోజుల పర్యటన లో భాగంగా శనివారం ఉదయం ఆయన జమ్మూ కాశ్మీర్‌ చేరు కున్నారు. 2019 ఆగస్టులో ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తరువాత అమిత్‌ షా ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. కాశ్మీర్‌కు చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో జమ్మూ కాశ్మీర్‌ లెఫ్టినె ంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ స్వా గతం పలికారు. ఇటీవల ఉగ్రవాద కాల్పుల్లో అమరుడైన జమ్మూ కాశ్మీర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ పర్వేజ్‌ అహ్మద్‌ ఇంటికి వెళ్లా రు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనం తరం అహ్మద్‌ భార్యకు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం కాశ్మీర్‌లో క్షేత్ర స్థాయి పరిస్థితులపై హోంమంత్రి అమిత్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.
అప్రమత్తంగా ఉండాలి
అమరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని అమిత్‌ షా భరోసా ఇచ్చారు. దేశ రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. చలి కాలం సమీపిస్తున్నందున.. ఉగ్రవాదుల చొరబాట్లకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ దేశ రక్షణలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రతీ జవాన్‌ సమస్యను పరిష్కరి స్తామని, దేశ రక్షణ విషయంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. చొరబాట్లను తిప్పికొట్టాలని ఆదేశించారు. కేంద్రం ఎప్పటికీ వెన్నంటి ఉంటుందన్నారు. కాల్పుల విరమ ణ ఒప్పందానికి తూట్లు పొడిచే వారికి ధీటుగా సమాధానం ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. కొన్ని రోజులుగా సాధా రణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది 32 మంది చనిపోయారని తెలిపారు. తొలి 9 నెలల్లో 63 కేసులు నమోదయ్యాయి.
ఎన్‌కౌంటర్లపై ఆరా
ఎల్‌ఓసీ వెంట నెలకొన్న తాజా పరిస్థితులను ఆర్మీ అధికా రులను అడిగి తెలుసుకున్నారు. సరిహద్దు వెంట ఉగ్రవాదుల చొరబాట్లపై కూడా ఆయన సమీక్షించారు. జమ్మూ కాశ్మీర్‌లో భద్రత అంశాలకు సంబంధించిన అంశాలను సెక్యూరిటీ ఏజెన్సీ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీ క్షలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ అరవింద్‌ కుమార్‌, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ చీఫ్‌ పంకజ్‌ సింగ్‌, సీఆర్‌పీఎఫ్‌ చీఫ్‌, ఎన్‌ ఎస్‌జీ చీఫ్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌ పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భద్రతాపరమైన సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. ఒకవైపు కాశ్మీర్‌లో పౌర హత్యలు, మరోవైపు ఉగ్రవాదు లను కట్టడి చేసేందుకు భద్రతా బలగాల ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్న పరిస్థితుల్లో.. అమిత్‌ షా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
జమ్మూలో భారీ భద్రత
ఇటీవల జమ్మూలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అమిత్‌ షా పర్యటనను దృష్టిలో పెట్టు కుని అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించారు. డ్రోన్‌లు, మోటార్‌ బోట్‌లతో పహారా కాస్తున్నారు. శ్రీనగర్‌లో అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచడానికి డ్రోన్లను వినియో గిస్తున్నారు. అదేవిధంగా దాల్‌ సరస్సు, జెహ్లం నదిలో సీఆర్‌పీఎఫ్‌ మోటార్‌ బోట్‌లతో నిఘా ఉంచారు. కొన్ని ప్రాంతాల్లో స్నైపర్స్‌, షార్ప్‌ షూటర్లను మోహరించారు.

నియోజకవర్గాల పునర్విభజన చేస్తాం
జమ్ము-కాశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన చేసి తీరుతామని అమిత్‌షా స్పష్టంచేశారు. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని, ఆపే రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని తెలిపారు. కాశ్మీర్‌ పర్యటనలో స్థానిక యూత్‌ క్లబ్‌ సభ్యులతో షా సంభాషించారు. కాశ్మీర్‌ లోయలో అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని, యువతతో స్నేహాన్ని కోరుకుంటున్నానని చెప్పారు. స్థానికంగా శాంతి సామరస్యాలకు విఘాతం కలిగి ంచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. యువతకు ఉపాధి అవకాశాలూ పెంచుతామని చెప్పారు. ఇక్క డి ప్రతి పంతాయతీలో యూత్‌ క్లబ్‌ ఏర్పా టు చేస్తామని, ఒక్కో క్లబ్‌కు రూ. 25వేలు అందజేస్తామని ప్రకటించారు. కాశ్మీర్‌లో నూతన శకం ప్రారంభమైంది. ఉగ్రవాదం, అవినీతి, కుటుంబ పాలన రాజకీయాల నుంచి శాంతి, అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు వైపు అడుగులు పడుతున్నాయి. ఫలితంగా రాళ్ల దాడులు పూర్తిగా తగ్గాయి. 2019 నుంచి స్థానికంగా పారదర్శకమైన, అవినీతి రహిత పాలన కొనసాగుతోంది. ఆర్టికల్‌ 370 రద్దు వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి అని షా వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement