Saturday, November 23, 2024

ఏపీలో పూర్తిస్థాయి లాక్ డౌన్..?

ఏపీలో ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ క‌రోనా వ్యాప్తి అదుపులోకి రావ‌డం లేదు. క‌ర్ఫ్యూను కొంద‌రు లైట్ తీసుకుంటున్న‌ట్లు ప్ర‌భుత్వానికి నివేదిక అందింది. దీంతో ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌ల దిశ‌గా సర్కార్ అడుగులు వేస్తుంది. ఇప్పటికే క‌ర్ఫ్యూ స‌మ‌లింపు స‌మ‌యాన్ని ఉద‌యం 6 గంట‌ల నుంచి 9 గంట‌ల‌వ‌ర‌కు లేదా 6 గంటల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు కుదించే విష‌యాన్ని ప‌రిశీలిస్తుంది. సోమ‌వారం అధికారులు, ప‌లువురు మంత్రుల‌తో చ‌ర్చించిన అనంత‌రం సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు.

మ‌రోవైపు ఏపీలో పాజిటివిటీ రేటుపై కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్థ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పాజిటివిటీ విష‌యంలో ఏపీ దేశంలో 10 వ స్థానంలో ఉంద‌న్నారు. పాజిటివిటీ రేటు పది శాతం దాటితేనే లాక్ డౌన్ విధించాలని ఐసీఎంఆర్‌ సూచిస్తోంది. అలాంటిది ఏపీలో ఇప్పటికే ఈ పాజిటివిటీ రేటు ఇరవై శాతం ఉంది.మరి ఈ సమయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement