Tuesday, November 26, 2024

జొన్న రొట్టెల‌కు ఫుల్‌ క్రేజ్‌.. పూర్వీకుల ఆహార‌పు అల‌వాట్లే బెస్ట్ అంటున్న జ‌నం!

ప్రస్తుత సమాజంలోని మానవుడు ఉరుకులు, పరుగుల జీవితం గడుపుతున్నాడు. ఇంటిలో సమయం కేటాయించేది తక్కువ… బయట ఉండేది ఎక్కువ. దీంతో ఆహారపు అలవాటను మరిచి అందుబాటులో ఏది దొరికితే అది తింటున్నారు. ఫలితంగా ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. లక్షలాది రూపాయలు వైద్యం కోసం ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. అయినా కోలుకునే పరిస్థితులు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఈ నేపధ్యంలో మళ్లీ పూర్వీకుల ఆహారపు అలవాట్లు తెరమీదకు వస్తున్నాయి. దీంతో వాటినే ఆచరించే పనిలో పడి.. తద్వారా కొద్దిమేరకైనా తమ జీవితాలను కాపాడుకోవచ్చని సగటు జీవి ఆశపడుతున్నాడు.

అందులో ముఖ్యంగా జొన్నరొట్టకే ఇస్తున్నారు ప్ర‌జ‌లు. మన పూర్వీకులకు ముఖ్యమైన ఆహారం జొన్న రొట్టెలు, ఈ పౌష్టికాహారం తిన్నవారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. నేడు జంక్‌ఫుడ్‌కు అలవాటు పడుతున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. షుగర్‌, బీపీ సమస్యలతో బాధపడే వారికి జొన్న రోట్టే దివ్య‌ ఔషాధంగా పనిచేస్తోంది. దీంతో ఈ జొన్న రొట్టెల కేంద్రాలకు ఆదరణ కనిస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేకంగా తయారు చేసిఅమ్ముతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement