న్యూఢిల్లి : ఆర్థిక సంక్షోభం, ప్రజల అశాంతితో తల్లడిల్లుతున్న శ్రీలంకలో సుస్థిరతకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఆర్థికంగా కోలుకునేందుకు భారత్ సంపూర్ణ సహకారం అందిస్తుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీలంకలో తాజా పరిణామాలపై స్పందించారు. శ్రీలంక పౌరుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు. పొరుగుదేశమైన శ్రీలంకతో చారిత్రక బంధం ఉందన్న ఆయన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇప్పటికే సహాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..