Monday, November 18, 2024

ధరల పిడుగులు.! భ‌గ్గుమంటున్న నిత్యావ‌స‌ర ధరలు..

ఎండాకాలం ప్రారంభంలోనే ఒక వైపు మండుగుతున్న ఎండలకు తోడు.. మరో వైపు ధరల మంటలు భగ్గుమంటున్నాయి. ‘సబ్‌కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌’ అంటూనే సామాన్య ప్రజానీకాన్ని ధరలతో బాదేసింది. వంట గ్యాస్‌తో పాటు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సైతం పెంచేసింది. సిలిండర్‌ ధర రూ.50 పెంచడంతో ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.1000 దాటింది. మరో వైపు వంట నూనెలు సలసలా కాగుతుండగా.. చికెన్‌ ధరలు కాశానంటి.. కిలో రూ.300కు చేరింది. ఇలా… ఒక్క సారిగా ధరలు పెంచి సామాన్యుడి పై విరుచుకుపడింది. ఈ వారంలో డీజిల్‌, పెట్రోల్‌ ధరలు మూడో సారి పెంచినట్లయింది. ఇలా ఇంధన సంస్థలు పూటపూటకూ ధరలు పెంచుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. మరో వైపు బంగారం ధరలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ధరల భారాన్ని చూసి పేదలు, సామాన్యులు గుడ్లు తేలేస్తున్నారు. దీనికి తోడు కల్తీ మాఫియా మార్కెట్‌లోకి అడుగు పెట్టి రాజ్యం ఏలుతున్నారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement