Tuesday, November 26, 2024

Fuel | పెరగనున్న ఇ-20 పెట్రోల్‌ పంపులు.. కేంద్ర మంత్రి వెల్లడి

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపి విక్రయించే పెట్రోల్‌ పంపుల సంఖ్యను పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా ఈ పంపులను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపి విక్రయించే పెట్రోల్‌ను ఇ20 పెట్రోల్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నాటికి 8న తొలి ఇ20 పెట్రోల్‌ పంపు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సంఖ్య 600కు పెరిగింది. 2025 నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు వస్తామని మంత్రి ప్రకటించారు.

2013-14 సంవత్సరంలో ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌

వినియోగం 1.53 శాతం మాత్రమే ఉంది. 2023 మార్చి నాటికి 11.5 శాతానికి పెరిగిందని హర్ధీప్‌ సింగ్‌ తెలిపారు. వాల్యూమ్‌ పరంగా చూస్తే 2013-14 నాటికి ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగం 38 కోట్ల లీటర్లు ఉండగా, 2021-22 నాటికి 433.6 కోట్ల లీటర్లకు పెరిగిందన్నారు. బయో ప్యూయల్స్‌ విక్రయించే పెట్రోల్‌ పంపుల సంఖ్య కూడా 2016-17లో29,890 ఉండటే, ప్రస్తుతం అవి 67,640కి చేరాయని మంత్రి వివరించారు.

- Advertisement -

20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ను విక్రయించేందుకు ఉద్దేశించిన వాస్తవ లక్ష్యం 2030వ సంవత్సరంగా పెట్టుకున్పటికీ, దాన్ని 2025 నాటికి ప్రభుత్వం కుదించినట్లు చెప్పారు. ఇందులో ప్రస్తుతం 11.5 శాతం మైలురాయిని చేరుకున్నామని ఆయన తెలిపారు. పెట్రోల్‌లో 10 శాతం ఇంథనాల్‌ను కలపాలన్న లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న గడువు కంటే ముందుగానే 2022 జూన్‌ నాటికి చేరుకున్నామని తెలిపారు. 2006-07లో చమురు దిగుమతి చేసుకునే దేశాల సంఖ్య 27 ఉంటే, 2023 నాటికి ఆయా దేశాల సంఖ్య 39కి పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతి పెద్ద చమురు వినియోగదారుగా మన దేశం ఉందని మంత్రి చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement