ప్రపంచంలోనే అత్యంత శీతల నగరంగా ఖ్యాతి గడించిన తూర్పు సైబీరియాలలోని యాకుత్స్క్‌లో ఉష్ణోగ్రతలు అత్యంత దారుణంగా మైనస్ 62.7 డిగ్రీలకు పడిపోయాయి. ఇదే నగరం గతంలో మైనస్ 50 డిగ్రీల సెల్సిnnయస్‌కు పడిపోయి రికార్డు సృష్టించింది. సైబీరియాలో ప్రస్తుతం అత్యంత దారుణమైన వాతావరణం నెలకుని ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రష్యాలో రెండు దశాబ్దాల తర్వాత ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇదే తొలిసారి అని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు.
రష్యాలోని అనేక నగరాల్లో రికార్డు స్థాయిలో అత్యంత అల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రష్యాలోని యాకుటియా ప్రాంతంలోని టోంగులాఖ్‌లో నమోదైన మైనస్ 62.7 డిగ్రీల ఉష్ణోగ్రత ఈ నెలలో మూడవసారి నమోదైన ఆల్ టైం కనిష్ట స్థాయిని బద్దలు కొట్టిందని వాతావరణ నివేదిక తెలిపింది. ఇలాంటి దారుణ పరిస్థితులకు అలవాటు పడిన ప్రజలు, తమను తాము వెచ్చగా ఉంచుకోడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.