సీపీగెట్..
సీపీగెట్-2021 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభంకానుంది. రిజిస్ట్రేషన్లు, ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలనకు ఈనెల 10 వరకు అవకాశం కల్పించారు. 12 నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు గడువు ఇచ్చారు. సీట్లను ఈనెల 19న కేటాయించనున్నారు. 20 నుంచి 25 వరకు సీటు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని సీపీగెట్ కన్వీనర్ ప్రొ.ఐ.పాండురంగా రెడ్డి తెలిపారు.
పీజీఈసెట్..
ఎంఈ, ఎంటెక్, ఎం.ఆర్క్, ఎంఫార్మసీ, ఫార్మ్‌డి(పీ.బీ) కోర్సులకు సంబందించిన స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్‌కు 6వ తేదీ నుంచి 7 వరకు, వెబ్ ఆప్షన్ల కోసం ఈనెల 9 నుంచి 11 వరకు అవకాశం కల్పించారు. సీట్ల కేటాయింపును 16వ తేదీన ప్రకటించనున్నారు. సీటు పొందిన అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 19 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని కన్వీనర్ ప్రొ.పి.రమేష్ బాబు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital