Sunday, November 24, 2024

Big story | ఇక‌పై బండిమీదే బ్యాంకాక్‌కు.. భారత్-బ్యాంకాక్‌ హైవే 70శాతం పూర్తి

ఇకపై భారతదేశం నుండి బ్యాంకాక్‌కు వెళ్లడానికి విమానాన్ని బుక్ చేయవలసిన అవసరం లేదు.. ఎందుకంటే ఈ ప్రయాణాన్ని పూర్తి చేసేందుకు రోడ్డు మార్గం సిద్దం అవుతోంది. 3 దేశాలు కలిసి నిర్మిస్తున్న భారత్-బ్యాంకాక్‌ హైవే త్వ‌ర‌లోనే పూర్తి కానుంది. దాదాపు 1,360 కి.మీ పొడవుతో భారత్, మయన్మార్, థాయ్‌లాండ్ సంయుక్తంగా నిర్మిస్తున్న కోల్‌కతా-బ్యాంకాక్ హైవేతో ఈ ప్ర‌యాణం సాధ్యమవ్వ‌నుంది. ఇటీవల., కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ భారత్-మయన్మార్-థాయ్‌లాండ్ హైవే దాదాపుగా 70 శాతం పూర్తయిందని చెప్పారు.

నితిన్ గడ్కరీ వార్తా సంస్థ పిటిఐ మాట్లాడుతూ, హైవే ప్రాజెక్ట్‌లో 70 శాతం పనులు పూర్తయ్యాయని వెల్ల‌డించారు. 3 దేశాలు నిర్మిస్తున్న ఈ హైవే పనులు వచ్చే 3-4 ఏళ్లలో పూర్తి కాగలవని ఆయన అన్నారు. పూర్తయిన తర్వాత, కోల్‌కతా నుండి బ్యాంకాక్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణించే వీలు ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్ట్ పూర్తైన త‌రువాత‌.. లావోస్, కంబోడియా, వియత్నాం ప్రాంతాలకు త్రైపాక్షిక రహదారిని విస్తరించాలని భారతదేశం యోచిస్తోంది.

- Advertisement -

ఈ రహదారి ఎక్కడ, ఎలా ప్రారంభమవుతుంది?

మణిపూర్‌లోని భారత్-మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని మోర్ అనే ప్రదేశం నుంచి భారత్-మయన్మార్-థాయ్‌లాండ్ హైవే ప్రారంభమవుతుంది. ఈ ఎక్జైటింగ్ జ‌ర్నీ భారత్-మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని మోర్ నుండి మయన్మార్-థాయ్‌లాండ్ సరిహద్దులో ఉన్న మే సోట్ అనే అందమైన పట్టణానికి తీసుకెళ్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement