Tuesday, November 19, 2024

28 నుంచి మావోయిస్టుల వారోత్సవాలు.. ఏవోబీలో అన్నల అలజడి!

అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రా-ఒడిశా సరిహద్ద్దు ప్రాంతంలో మళ్లీ మావో పంజా విసురుతోంది.. గత రెండేళ్ళుగా ఉనికి కోసం పాట్లు పడుతున్న అన్నలు తమ గత ప్రాభవాన్ని చాటి చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారు..కరొనా కంటకాలం, లొంగుబాట్లు, గిరిజనుల వ్యతిరేకతతో మరింత బలహీనపడిన విప్లవరక్తం ఇప్పు డిప్పుడే పుంజుకుంటోందా.. అన్నట్టు ఇటీవల కాలంలో కొన్ని దాడులు, ఘటనల ద్వారా ట్రైల్‌రన్‌ వేశారు అన్నలు. జవాన్లు పెద్ద సంఖ్యలో బలైన ఘటన దీనిలో భాగమే. అయితే అంతే ధీటుగా పోలీసు బలగాలు సమాధానం చెబుతున్నాయి. కాలు కదిపినా అప్రమత్తమయ్యే విధంగా నిఘా యంత్రాంగం సునిశితంగా పని చేస్తోంది. అయినా సరే..

ప్రజాయుద్ధాన్ని పురోగమింపజేద్దామనే లక్ష్యంతో మావో యిస్టు పార్టీ ముందడుగు వేస్తోంది. ఇందుకు అమరుల సంస్మరణ వారోత్సవాలను వేదిక చేసుకుంటోంది. విప్లవోద్యమాన్ని నిర్మూలించే లక్ష్యంతో పాలకవర్గాలు అమ లు చేస్తున్న ‘అపరేషన్‌ సమాధాన్‌ – ప్రహార్‌’ దాడులను ఓడిస్తూ దృఢసంకల్పం తదితర ఆదర్శాలను స్మరించుకుంటూ అమరుల బాటలో ముందు కు సాగుదామని మావోయిస్టులు ప్రతిన బూనారు. ఈమేరకు ప్రజలకు పిలుపునిస్తూ ఓ లేఖను విడుదల చేశారు. ఏఓబి జోన్‌ వ్యాప్తంగా జూలై 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అమరుల స్మారకవారాన్ని నిర్వహించాలని మావోయిస్టు పార్టీ ఆంధ్ర-ఒడిశా బార్డర్‌ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి గణష్‌ పేరుతో లేఖ విడుదలైంది. ఇంకేముంది సరిహద్దులో అన్నల అలజడితో పోలీసుశాఖ మరింత అప్రమ త్తమైంది. మరోవైపు ఇంటిలిజెన్స్‌ వర్గాలు అలెర్ట్ అయ్యాయి. కూంబింగ్‌ మరింత ముమ్మరమైంది. పటిష్ట చర్యలకు ఏపీ పోలీసు యంత్రాంగం ఉపక్రమించింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement