ఖమ్మం జిల్లాలో బీఆర్ ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పొంగులేటితో ఫ్రెండ్స్‌షిప్ చేస్తున్నఎనిమిది మంది పార్టీ లీడర్లు, ప్రజాప్రతినిధులపై (ఆదివారం) బహిష్కరణ వేటు వేసింది. వీరిలో పలువురు నామినేటెడ్ పదవుల్లో కూడా ఉన్నారు. బహిష్కరణకు గురైన వారిలో కారేపల్లి, మాదారం సర్పంచ్ లు స్రవంతి, నరేశ్ ఉన్నారు. ఇక నామినేటెడ్ పదవుల్లో ఉన్న మరో ఆరుగురికి షాక్ ఇచ్చింది బీఆర్ ఎస్ పార్టీ. వారిని కూడా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
నామినేటెడ్ పదవుల్లో ఉండి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో బీఆర్ ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వారిలో వైరా మున్సిపల్ చైర్మన్ నూతకాని జైపాల్ , రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా ఆత్మ కమిటీ చైర్మన్
కోసూరు శ్రీనివాసరావు, కొనిజర్ల ఎంపీపీ గోసు మధు ఉన్నారు.