అస్సాంలో వరద పరిస్థితి గురువారంనాటికి కూడా భయంకరంగానే ఉంది. ఇంకా 54.5 లక్షలమంది వరద ముప్పులోనే వున్నారని, తాజాగా 12మంది మరణించారని అధికారులు తెలిపారు. చాలా జిల్లాల్లో బ్రహ్మపుత్ర, బరాక్ నదులు దాని ఉపనదులు ఉప్పొంగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 36 జిల్లాల్లో భూములు ముంపుకు గురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గినప్పటికిలో రాష్ట్రవ్యాప్తంగా 276 బోట్ల సహాయంతో ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఇతర ఏజెన్సీలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూనే వున్నారు. బాధిత ప్రజలకు సహాయక సామగ్రిని పంపిణీ చేయడంలో జిల్లా పాలనా యంత్రాంగానికి సహాయం చేయడంలో కూడా ఈ దళాలు నిమగ్నమయ్యాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు 112 రెవిన్యూ సర్కిళ్లు, 4941 గ్రామాలను ప్రభావితం చేశాయని, 2,71,125 మంది ప్రజలు 845 సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారని తెలిపారు. వరదల కారణంగా కామ్రూప్ జిల్లాలో రెండు కట్టలు తెగిపోవడంతోపాటు 218 రోడ్లు, 20 వంతెనలు దెబ్బతిన్నాయి. 99,026 హెక్టార్ల పంట, 33,17,086 జంతువులు వరదల్లో మునిగిపోయాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.