ఫ్రెంచ్ ఓపెన్‌లో చెక్ టెన్నిస్ క్రీడాకారిణి కరోలినా ముచోవా, బెలారస్ ప్లేయర్ అరీనా సబలెంకా సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టారు. మంగళవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో 2021 ఫైనలిస్ట్ అనస్తాసియా పావ్లియుచెంకోవాపై 7-5, 6-2 తేడాతో వరుస సెట్లలో కరోలినా ముచోవా విజయం సాధించింది. పారిస్ క్లేపై చివరి నాలుగో ర్యాంక్‌లో తొలి స్థానాన్ని సంపాదించుకుంది. 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ముచోవా తన కెరీర్లో రెండవ గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్‌కు చేరుకుంది. గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకునే ప్రయత్నంలో తదుపరి మ్యాచ్‌లో అరీనా సబలెంకాతో తలపడుతుంది.
మరొక మ్యాచ్‌లో ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలినా స్విటోలినా ఓటమిపాలైంది. గ్రాండ్‌స్లామ్ టెన్నిస్‌లో ఆమె అద్భుత పునరాగమనానికి, బెలారస్ ప్లేయర్, ప్రపంచ నంబర్ 2 క్రీడాకారిణి అరీనా సబలెంకా బ్రేక్ వేసింది. 6-4, 6-4 తేడాతో నెగ్గిన సబలెంకా రోలాండ్ గారోస్‌లో సగర్వంగా సెమీస్‌కు చేరుకుంది. మరోసారి ఉక్రెయిన్, బెలారస్ ప్లేయర్ల మధ్య ఆసక్తికర ముగింపు ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు నెట్ వద్దకు వచ్చిన సబలెంకాకును ఏమాత్రం పట్టించుకోకుండా స్విటోలినా పక్కకు వెళ్లిపోయింది. ఈ చర్యను అభిమానులు నిరసించారు.