పారిస్ వేదికగా జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యసేన్ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో లక్ష్య సేన్ 15-21, 21-15, 21-3 పాయింట్ల తేడాతో జపాన్‌కు చెందిన కాంటా సునేయామాపై గెలిచాడు.
మరోవైపు, ప్రియాంషు రజావత్ తన తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. డెన్మార్క్ కు చెందిన విక్టర్ ఆక్సెల్సెన్ తో పోటీ పడిన ప్రియాన్షు రజావత్ 21-8, 21-15 పాయింట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు. ఇక సింగిల్స్ ఈవెంట్స్‌లో రేపు (బుదవారం) భారత్ తరఫున కిదాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ తమ తొలి రౌండ్ ఆడనున్నారు.
ఇప్పటికే జరిగిన డబుల్స్‌లో ఈవెంట్‌లో భారత పరుషుల జోడీ సాత్విక్ – చిరాగ్‌లతో పాటు మహిళల ద్వయం ట్రీసా జాలీ – గాయత్రి గోపిచంద్‌ల జోడీ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్‌లో చిరాగ్ – సాత్విక్‌లు తొలి రౌండ్‌లో 21-13, 24-22 తేడాతో మలేషియాకు చెందిన మ్యాన్ వీ చోంగ్ – కై వున్ టీ లను ఓడించింది. గత 8 మ్యాచ్‌లలో మలేషియా ఆటగాళ్లతో చిరాగ్ – సాత్విక్‌లకు ఇది ఐదో గెలుపు. ట్రీసా – గాయత్రిల ద్వయం 16-21, 21-19, 21-17 తేడాతో తనీషా క్రాస్టో -పొన్నప్పలను ఓడించింది.