ప్రముఖ గాంధేయవాది, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడిన శతాబ్దపు స్వాతంత్ర్య సమరయోధుడు, కర్ణాటక ప్రసిద్ధ స్వరం అయిన హెచ్.ఎస్. దొరైస్వామి బుధవారం బెంగళూరులో కన్నుమూశారు. ఆయన వయసు 104 ఏళ్లు. బెంగళూరులోని జయదేవ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దొరైస్వామి రెండు వారాల క్రితం కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా మహమ్మారిని జయించి ఆస్పత్రి నుంచి ఇంటికెళ్లిన కొద్దిరోజులకే ఆయన గుండెపోటుతో మృతిచెందాడు. ఏప్రిల్ 10, 1918న జన్మించారు. దొరైస్వామి ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర సంగ్రామం అరెస్ట్ అయిన ఆయన 14 నెలల జైలు శిక్ష అనుభవించారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement