న్యూఢిల్లిd: దేశంలోని 6100 రైల్వే స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైఫై ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని రైల్‌టెల్ తెలిపింది. రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పెద్ద న్యూట్రల్ మౌలిక సదుపాయాల ప్రొవైడర్స్‌లో రైల్‌టెల్ ఒకటిగా ఉంది. ఉత్తర రైల్వేలోని లక్నో డివిజన్‌మీదుగా యూపీలోని రాయ్‌బరేలీ జిల్లాలోని ఉబర్ని రైల్వేస్టేషన్‌లో వైఫై సౌకర్యం ప్రారంభించడంతో వైఫై కవరేజీ మంగళవారం 6100 స్టేషన్ల మైలురాయిని చేరుకుంది. కాగా 6100 రైల్వే స్టేషన్లలో 5వేలకు పైగా స్టేషన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం విశేషం.
ఈశాన్య ప్రాంతంలోని స్టేషన్లుతోపాటు కాశ్మీర్ లోయలోని మొత్తం 15స్టేషన్లులో వైఫై సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని అమలు చేసే బాధ్యతను రైల్వే మినీ రత్న పీఎస్‌యూ రైల్‌టెల్‌కు అప్పగించినట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. రైల్‌టెల్ సంస్థ రిటైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవ రైల్‌వైర్ బ్రాండ్‌పేరుతో రైల్వేస్టేషన్లలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ పబ్లిక్ వైఫైని అందిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..