కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త కరోనా వ్యాక్సిన్ పాలసీ సోమవారం రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్లు వేయనుంది. ఈ నెల 8న ప్రధాని మోదీ దీనికి సంబంధించిన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 75 శాతం వ్యాక్సిన్లను తయారీదారుల నుంచి కొని అందరికీ ఫ్రీగా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వమూ వ్యాక్సిన్ల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసంర లేదు. ఇప్పటి వరకూ కేవలం 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చేది. తాజా వ్యాక్సిన్ విధానం ప్రకారం 75 శాతం వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేయనుండగా.. మిగిలిన 25 శాతం వ్యాక్సిన్లు మాత్రం ప్రైవేటు వారికి అమ్ముకునే అవకాశం తయారీదారులకు కల్పించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement