Tuesday, November 26, 2024

గృహిణులకు ఆన్‌లైన్ వంటకాలపై ఉచిత సెమినార్‌..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : ఇంట్లో గృహిణులు తయారుచేసిన వంటకాలు రుచికరంగా శుభ్రతతో ఎలా తయారు చెయ్యాలి ? వాటిని ఆన్‌ లైన్‌ ద్వారా ఎలా అమ్మకం జరపాలి, ఫుడ్‌ లైసెన్స్‌ ఎలా పొందాలి, ఆర్డర్లు ఎక్కువగా రావాలంటే ఏమి చెయ్యాలనే అంశాలపై ఉచిత సెమినార్‌ ని నిర్వహిస్తున్నట్లు షీరో హోమ్‌ ఫుడ్‌ సొసైటీ కన్వీనర్‌ సువర్ణా దేవి పాకలపాటి ఒక ప్రకటనలో తెలిపారు.

వంటలపై ఎక్కువ అనుభవం లేని వారికి సైతం 300 వంటకాలపై శిక్షణ ఇస్తున్నామని, ఈనెల 31వ తేదీన ఆదివారం బంజారాహిల్స్‌ ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌ లో జరిగే ఈ సెమినార్‌ లో ఎవరైనా పాల్గొనవచ్చని, సెమినార్‌ లో ఆసక్తి కనబరచిన మహిళలకు ఆన్‌ లైన్‌, ప్రత్యక్ష శిక్షణా కార్యక్రమాలను చేపట్టనున్నామని, సెమినార్‌ లో పాల్గొనదలచిన వారు 6302334881 నెంబర్‌ ను సంప్రదించి తమ పేరుని రిజిస్టర్‌ చేయించుకోవాలని ఆమె తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement