కొవిడ్ కాలంలో నవంబర్ 30 వరకు ప్రజలకు ఉచితంగా రేషన్ అందించిన కేంద్రం.ఈ నెల 30 తర్వాత ఈ కార్యక్రమాన్ని పొడిగించేందుకు ఎలాంటి ఆదేశం అందలేదని, కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం వల్ల ప్రతిపాదన చేయలేదని ఆహార, ప్రజాపంపిణీ విభాగం కార్యదర్శి సుదర్శన్ పాండే వెల్లడించారు.
గతేడాది లాక్డౌన్ దృష్ట్యా గరీబ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా రుషన్ కార్డు హోల్డర్లకు 8 నెలలు ఉచిత రేషన్ అందించారు. 2020 ఏప్రిల్‌లో ఈ కార్యక్రమం మొదలైంది. కరోనా సెకండ్ వేవ్ కారనంగా ఈ ఏడాది మే, జూన్ వరకు ఈ కార్యక్రమం పొడిగంచారు . కరోనా పరిస్థితుల్లో పేదలు ఇబ్బంది పడకుండా.. జూన్‌లో మరో ఐదు నెలలు పొడిగించారు. దేశవ్యాప్తంగా ఎన్ఎఫ్ఎస్ఏ(జాతీయ ఆహార భద్రత చట్టం) కింద గుర్తింపు పొందిన రేషన్ కార్డుహోల్డర్లకు ఉచిత రేషన్‌ను అందిస్తోంది కేంద్రం. 80కోట్ల మంది ఈ కార్యక్రమంతో లబ్ధిపొందినట్టు ప్రభుత్వం గతంలో వెల్లడించింది.