కరోనా సమయంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్రం పేదలకు ఉచిత రేషన్‌ను అందించింది. ఈ పథకాన్ని మరికొన్ని నెలలకు పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను మరో ఐదు నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో ఈ పథకం కింద లబ్ధిదారులైన 81.35 కోట్ల మందికి జూలై నుంచి నవంబర్ వరకు ఉచిత ఆహారధాన్యాలు అందనున్నాయి. కాగా, పీఎం గరీబ్ కళ్యాణ్ యోజనను తొలుత ఏప్రిల్ నుంచి 3 నెలల పాటు అమలు చేశారు. అయితే కొన్ని రోజుల కిందట ఈ పథకాన్ని మరో 5 నెలలు పొడిగిస్తున్నట్లు మోడీ ప్రకటించారు. దీనికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఉచిత రేషన్ మరో 5 నెలలు పొడిగింపు
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement