Friday, November 22, 2024

6 నుండి పెంపుడు కుక్కలకు ఉచిత రేబిస్‌ టీకాలు: పశువైద్యశాల ఏడీ

నర్సాపూర్‌, (ప్రభ న్యూస్‌) : పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధులను జూనోటిక్‌ జబ్బులు అంటారని, ఈ వ్యాధులలో రేబిస్‌ సోకిన కుక్కలు మనుషులను, పశువులను కరిసినచో వస్తుందని నర్సాపూర్‌ ఏరియా పశువైద్యాశాల ఏడీ జనార్దన్‌రావు తెలిపారు. మంచి కుక్కలు అనగా రేబిస్‌ లేని కుక్కలు మనిషిని కరిచినచో మనిషికి ఏమీ కాదన్నారు.

పెంపుడు కుక్కలకు సంవత్సరానికి ఒకసారి వ్యాధి నిరోధక టీకాలను వేయించినచో ఈ కుక్కలు మనిషిని కరిచినా మనుషులకు రేబిస్‌ వ్యాధి రాదన్నారు. పెంపుడు కుక్కలను పెంచే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ వ్యాధి టీకాలను తమ కుక్కలకు నర్సాపూర్‌ ఏరియా పశువైద్యాశాలలో ఇప్పించుకోవాలని ఆయన సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement