పటాన్చెరు, ప్రభన్యూస్ : ఈనెల 18వ తేదీ సోమవారం పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనదని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. 14 విభాగాలకు చెందిన వైద్యులు శిభిరంలో అందు బాటులో ఉంటారని, ప్రాథమిక వైద్య పరీక్షలు చేసిన అనంతరం అవసరమైతే శస్త్ర చికిత్సల కోసం హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు రెఫర్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూసద్వినియోగం చేసుకోవాలని ఆయన మరోమారు కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..