పాలకుర్తి : స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాల ఫలితంగా నేడు స్వేచ్ఛవాయువులు పీలుస్తున్నామని, భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దదని, దేశ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమాన అవకాశాల్ని అందించడానికి పునరంకితం అయ్యే రోజని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గణ తంత్ర వేడుకల సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు లోని స్కూల్ ఆవరణ, స్థానిక మసీదులో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం, తెలంగాణ సాధనలో ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను మరచిపోవద్దని కోరారు. భారత స్వాతంత వజ్రోత్సవాలను నిర్వహించుకుని దేశ కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటుకున్నామని అన్నారు. ఉద్యమ నాయకుడిగా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సీఎం కేసీఆర్ సాధించిన తెలంగాణ అనతికాలంలోనే దేశంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని వెల్లడించారు. అనేక వినూత్న పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement